డజనుకు పైగా కోతులు హార్ట్ అటాక్ తో చనిపోయాయట.. కానీ..!

ఓ డజను కోతులు అడవిలో చనిపోయి పడి ఉన్నాయి. అదీ ఒకే చోట.. ఒకే విధంగా చనిపోయి కనిపించాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కొత్వాలి మొహమ్మది అటవీ ప్రాంతంలో ఇలా చనిపోయిన కోతులను స్థానికులు గుర్తించారు. వీటికి పోస్ట్ మార్టం నిర్వహించిన వెటర్నరీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఆ కోతులన్నీ హార్ట్ అటాక్ తో చనిపోయాయని చెప్పాడు. ఆ ప్రాంతంలో పులులు ఎక్కువగా తిరుగుతుంటాయని.. వాటి గాండ్రింపు విన్న కోతులకు కార్డియాక్ అరెస్ట్ అయి ఉంటుందని పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఆయన తెలిపారు.

అయితే ఈ విషయంపై జంతు ప్రేమికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోతులు కూడా అడవుల్లో జీవిస్తూ ఉంటాయని.. చాలా సార్లు అవి పులుల అరుపులు విని ఉంటాయని.. ఇలా హార్ట్ అటాక్ తో చనిపోవడం అనేది అసంభవం అని అంటున్నారు. ఎవరైనా విషం పెట్టి చంపారా అన్న కోణంలో ఆరాతీస్తున్నారు. వీటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చనిపోయిన కోతులను ఓ పాలితిన్ సంచిలో వేసుకుంటూ వెళ్ళారు. అలాగే ఎవరు చేశారో కానీ చాలా తప్పు చేశారు అన్న ఆడియో కూడా మనం వినొచ్చు.

About the author

Related

JOIN THE DISCUSSION