హజ్ యాత్రలో మరణించిన ఇద్దరు హైదరాబాద్ వాసులు

పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళిన ఇద్దరు హైదరాబాద్ వాసులు మక్కాలో మరణించారు. వారు చనిపోడానికి కారణం ఆరోగ్య సమస్యలేనని తెలంగాణ హజ్ కమిటీ అధికారులు తెలిపారు. హజీ యూసుఫ్ ఖాన్ అనే 68 ఏళ్ల వ్యక్తి తన భార్య ఫాతిమా బేగంతో కలిసి హజ్ యాత్రకు వెళ్ళాడు. అయితే ఆయనకు ఆరోగ్యం సరిగా లేక మక్కాలో మరణించాడు.వారిది హైదరబాద్ లోని బోరబండ.

73 సంవత్సరాల మొహమ్మద్ జమాలుద్దీన్ తన భార్య నూర్జహాన్ బేగంతో కలసి మక్కా యాత్రకు వెళ్ళాడు. అక్కడ ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. మక్కా లోని అల్ నూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈయన టోలీచౌకి వాసి. వారి మృతదేహాలను భారత్ కు తీసుకొని రావడానికి అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

 

About the author

Related

JOIN THE DISCUSSION