బామ్మ‌పై పోలీసుల‌కు ఓ చిన్నారి ఫిర్యాదు

బామ్మ‌పై పోలీసుల‌కు ఓ చిన్నారి ఫిర్యాదు

భార‌త్‌లో నార్వే త‌ర‌హా చ‌ట్టాలుండుంటే.. ఈ చిత్రంలో క‌నిపిస్తున్న పిల్లాడి బామ్మ‌గారు జైలు ఊచ‌లు లెక్క‌పెడుతూ ఉండుండేవారు ఈ పాటికి. విష‌యం ఏమిటంటే.. ఈ బాలుడి బామ్మ త‌న డ‌బ్బులు తీసేసుకుంద‌ట‌. అంతే అత‌డికి కోప‌మొచ్చింది. నేరుగా పోలీసు స్టేష‌నుకు వెళ్ళాడు. బామ్మ మీద ఫిర్యాదు చేశాడు. బిత్త‌ర‌పోయిన పోలీసులు మెల్లిగా అత‌ణ్ణి లాలించి, వివ‌రాలు రాబ‌ట్టారు. యూకేజీ చ‌దువుతున్న ఈ బాలుడు చెప్పిన విష‌యాలు మీరే వినండి.


తండ్రికి ఫోనుచేసి పిలిపించి, అత‌డికి అప్ప‌చెప్పారు. రెండురోజుల క్రితం ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అత‌ను పోలీసు స్టేష‌నుకు వెళ్ళిన స‌మ‌యం రాత్రి 9.30గంట‌లు. అప్పుడ‌త‌ను స్టేష‌నుకు ఎలా వెళ్ళాడ‌నేది ఊహ‌కంద‌ని ప్ర‌శ్న‌.  ఈ కాలం పిల్ల‌లు చాలా హైప‌ర్ యాక్టివ్‌గా ఉంటున్నార‌ని ప్ర‌ముఖ విద్యావేత్త అమ‌ర‌నాథ్ వాసిరెడ్డి బుధ‌వారం రాత్రి న్యూసు లైవ్‌లో చెప్పారు. ఈ పిల్లాణ్ణి చూస్తే ఆయ‌న మాట‌లు నిజ‌మ‌నిపిస్తోంది.

పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రాన్ని ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. సినిమాలు, టీవీ సీరియ‌ళ్ళను త‌న కుమారుడు బాగా చూస్తాడ‌నీ, బ‌హుశా ఆ ప్ర‌భావంతోనే ఇలా చేసుండ‌వ‌చ్చ‌నీ బాలుడు చైత‌న్య తండ్రి చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *