వీరేంద్రుడిని భ‌య‌పెట్టిన బౌల‌ర్ ఎవ‌రంటే..!

వీరేంద్ర సెహ్వాగ్‌. భారత క్రికెట్ జ‌ట్టు మాజీ డాషింగ్ ఓపెన‌ర్‌. క్రీజులో కుదురుకున్నాడంటే బౌల‌ర్ల‌కు చుక్కలే. త‌న‌దైన శైలిలో, దూకుడుకు టెక్నిక్ మిళితం చేసి సెహ్వాగ్ కొట్టే షాట్ల‌ను చూడ్డానికి రెండు క‌ళ్లూ చాల‌వు.

టీమిండియా త‌ర‌ఫున టెస్టుల్లో రెండుసార్లు 300 ప‌రుగుల మార్క్‌ను దాటిన బ్యాట్స్‌మెన్ ఎవ‌రైనా ఉన్నారా అంటే అది ఒక్క వీరేంద్రుడు మాత్ర‌మే. అలాంటి బ్యాటింగ్ బ్లాస్ట‌ర్‌కు కూడా ఓ బౌల‌ర్ అంటే భ‌యం.

ఆ బౌల‌ర్ బంతిని అందుకున్నాడంటే మ‌న వీరేంద్రుడు కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడ‌తాడ‌ట‌. ఆ బౌల‌ర్ మ‌రెవ‌రో కాదు.. శ్రీ‌లంక తురుఫుముక్క, మాజీ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌.

ముర‌ళీధ‌ర‌న్ వేసిన బంతులను ఎదుర్కొన‌డానికి తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాడ‌ట‌. తాజాగా వీరూ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు.

తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ ఎవరో చెప్పుకొచ్చాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్‌ చాలా కఠిన‌మ‌ని, అతను వేసిన బంతిని షాట్‌ కొట్టడానికి చాలా కష్టపడేవాడినని అన్నాడు. ఒక్కోసారి ఎక్కడ ఔటైపోతానోనని భయం కూడా వేసేదని చెప్పాడు.

ముర‌ళీధ‌ర‌న్ బౌలింగ్ వేసేట‌ప్పుడు అత‌ని ముఖ కవళికలు కూడా త‌న‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేసేవని అన్నాడు. ముర‌ళీధ‌ర‌న్ మిన‌హా ఏ బౌలర్‌నైనా తాను సునాయాసంగానే ఎదుర్కొన్నాన‌ని అన్నాడు.

About the author

Related

JOIN THE DISCUSSION