స్ట్రెయిట్‌గా వెళ్లి రైట్ తీసుకుంటే ఒక ఓట‌మి ఎదుర‌వుతుంది..!

పాయింట్ ఇంట్ర‌స్టింగ్‌గా లేదూ! `స్ట్రెయిట్‌గా వెళ్లి రైట్ తీసుకుంటే ఒక ఓట‌మి ఎదుర‌వుతుంది. దాన్నుండి లెఫ్ట్‌కెళ్తే పెద్ద‌.న‌మ్మ‌క‌ద్రోహం క‌నిపిస్తుంది`..ఇదీ `ఇంద్ర‌సేన‌` టీజ‌ర్ సారాంశం.

జీవితంలో విజ‌యం అనే ఇంటిని చేరుకోవ‌డానికి అనేక అడ్డంగుల‌ను అధిగ‌మించాల్సి ఉంటుంద‌నే కాన్సెప్ట్‌ను ఈ టీజ‌ర్‌లో చూపించారు. బిచ్చ‌గాడు ఆలియాస్ విజ‌య్ ఆంటోనీ న‌టించిన తాజా సినిమా ఇంద్ర‌సేన‌.

ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం విడుద‌ల చేశారు. జీ శ్రీ‌నివాస‌న్ ద‌ర్శ‌కుడు. విజ‌య్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై దీన్ని నిర్మించారు. రాధికా శ‌ర‌త్‌కుమార్‌కు చెందిన్ ఆర్ స్టూడియో స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హిస్తోంది.

డిసెంబ‌ర్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బిచ్చ‌గాడుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రయ్యాడు విజయ్ ఆంటోని. అంత‌కుముందే- మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మ‌హాత్మా స‌హా ప‌లు తెలుగు సినిమాల‌కు సంగీతాన్ని అందించాడు.

బిచ్చ‌గాడుతో టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంద్ర‌సేన టీజ‌ర్ చూస్తోంటే.. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా క‌నిపిస్తోంది.

About the author

Related

JOIN THE DISCUSSION