గౌహ‌తి టీ20లో కోహ్లీ సాధించిన అరుదైన రికార్డ్‌..

భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య గౌహ‌తిలో జ‌రుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిజంగా అత్యంత అరుదైన‌దే. అదే కేప్టెన్ విరాట్ కోహ్లీ సున్నాకే అవుట్ కావ‌డం. టీ20 మ్యాచ్‌ల‌ను ఆడ‌టం మొద‌లు పెట్టిన త‌రువాత విరాట్ కోహ్లీ డ‌కౌట్ కావ‌డం ఇదే మొద‌టి సారి.

ఇప్ప‌టిదాకా కోహ్లీ మొత్తం 52 టీ20 మ్యాచ్‌ల్లో 47 ఇన్నింగ్‌ల‌ను ఆడాడు. ఒక్కటంటే ఒక్క‌సారి కూడా కోహ్లీ సున్నాకే వెనుదిర‌గ‌లేదు. ఈ సారి మాత్రం అత‌ను త‌న ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరాల్సి వ‌చ్చింది.

ఆసీస్ బౌల‌ర్ జేస‌న్ బెహ‌రెన్డార్ఫ్ బౌలింగ్‌లో అత‌నికే క్యాచ్ ఇచ్చి ఖాతా తెర‌వ‌కుండానే అవుట‌య్యాడు కోహ్లీ. టీ20 మ్యాచ్‌ల‌ల్లో ఇదే అత‌ని మొట్ట‌మొద‌టి డ‌కౌట్‌.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 118 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ త‌రువాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ప‌రుగుల‌కే రెండు వికెట్ల‌ను కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

About the author

Related

JOIN THE DISCUSSION