డేరా స‌చ్చాసౌధాలో విష‌క‌న్య‌లు..!

డేరా స‌చ్చా సౌధాలో త‌వ్వేకొద్దీ అక్ర‌మాలు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. డేరాలో త‌నిఖీల‌ను నిర్వ‌హిస్తోన్న అధికారుల బృందానికి నివ్వెర‌పోయే వాస్త‌వాలు క‌నిపిస్తున్నాయి. అత్యాచారం కేసులో డేరా చీఫ్ గుర్మీత్‌ రామ్ రహీమ్ బాబాకు జైలు శిక్ష పడిన తరువాత పలు చీక‌టి కోణాలు వెల్ల‌డ‌వుతున్నాయి.

గుర్మీత్ రామ్ రహీమ్ త‌న డేరా ఆశ్రమంలో విష కన్యలను నియ‌మించార‌ట‌. విష‌క‌న్య‌లు అనే గ్రూప్‌ను ఒక‌దాన్ని ఏర్పాటు చేశార‌ట‌. ఈ బృందంలోని మహిళలు డేరాలోని అందమైన యువతులను తమ వలలో వేసుకుని, రామ్ రహీమ్ గుహ‌కు తీసుకెళ్తుంటారు. దానికోస‌మే ప్ర‌త్యేకంగా ఈ బృందాన్ని ఏర్పాటు చేశాడు గుర్మీత్‌.

ఈ విషకన్యలు రామ్‌రహీంకు అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటారు. వారంతా గతంలో సాధ్వీలుగా ప‌నిచేసిన వారే. ఈ విష కన్యలు యువతులకు మాయమాటలు చెప్పి బాబా ఆశీర్వాదంతో పవిత్రులై పోతారంటూ అత‌ని వ‌ద్ద‌కు తీసుకు వెళతారు. ఆ స‌మ‌యంలో ఏ యువతి కూడా ఎదురు తిరగకుండా చూసే బాధ్యత కూడా విషకన్యలదే.

 

ఎవ‌రైనా ఎదురు తిరిగితే- వారిని నిర్బంధిస్తారు. వారికి 24 గంటల పాటు ఆహార పానీయాలు ఇవ్వరు. వారిని కుర్చీల్లో కట్టేసి కొడతారు. కోపంగా చూసే యువతుల ముఖంపై మసి పూసి, గాడిదలపై ఊరేగిస్తారు. రామ్‌రహీంకు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన గురుదాస్ సింగ్ ఈ విషయాలను పోలీసులకు వెల్లడించాడు. కాగా ఇలాంటి విషకన్యలపై పోలీసులు ఇంతవరకూ ఎలాంటి చర్యతీసుకోలేదు.

About the author

Related

JOIN THE DISCUSSION