మీ గోరు మీద ఇలాంటి గుర్తు కనిపించిందా.. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి..!

మీ గోరు మీద ఇలాంటి నల్లటి గుర్తు కనిపించిందా మీరు వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. లేదంటే చాలా చాలా ప్రమాదం సంభావించచ్చు. తనకు కలిగినట్లుగా వేరే ఎవరికీ అవ్వకూడదనే ఉద్దేశంతో ఓ మహిళ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అందరితో పంచుకుంది.

లీసా హ్యారిసన్ అనే మహిళ తన ఫేస్ బుక్ అకౌంట్ ఓ ఓ విషయాన్ని షేర్ చేసుకుంది. ఆమె మానిక్యూర్ చేసుకోవాలని ఓ బ్యూటీ పార్లర్ వద్దకు వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమె తన గోళ్ళ మీద ఉన్న నల్లని గీతను చూసి.. ఏదైనా డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వెయ్యమని కోరింది. అయితే దీన్ని గమనించిన బ్యూటీ పార్లర్ సిబ్బంది.. మేడమ్ ఇది రక్తహీనత వలన వచ్చింది కాదు.. మీకు క్యాన్సర్ సోకింది అని వారు బాంబు పేల్చారు. ఆ మాట విన్న వెంటనే ఆమె వణికిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళి అన్ని చెకప్ లు చేయించుకుంది. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ లో తేలింది ఏమిటంటే ఆమెకు సబ్ ఉంగువల్ మెలోనిమా అనే క్యాన్సర్ సోకింది.

ఈ(subungual melanoma cancer) క్యాన్సర్ చాలా ప్రమాదమైనది. క్యాల్సియం, రక్తం లేకపోవడం వలన ఏదో అవుతోందిలే గోర్లకు అని అనుకుంటే అది పొరపాటే. గోర్లు చాలా బలహీనమవ్వడమే కాకుండా అవి చేతి నుండి కిందకు జారిపోయే అవకాశం ఉంది. గోర్ల రంగు మారిపోతూ ఉంటాయి.. అలాగే వేళ్ళ మీద ఉన్న చర్మం రంగు కూడా మారిపోతుంది. ఒక వేలితో మొదలై అన్నిటినీ తినేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా వైద్యులను సంప్రదించడం మంచిది.

About the author

Related

JOIN THE DISCUSSION