ఈనెల 1న పెళ్ళి అయింది.. భార్యకు పిజ్జా తీసిద్దామని అనుకున్న భర్త.. భార్య ఆటోలో ఎక్కడికో..!

అక్టోబర్ 1న మేడ్చల్‌ జిల్లా కీసర మండలం ఆర్‌ఎల్‌ నగర్‌ లో పాలవ్యాపారి మాదినేని తిరుపతయ్య (23)తో కడప జిల్లా మైదుకూరుకు చెందిన రాజపుత్ర శివమల్లేశ్వరి (19) కి పెద్దలు వివాహం చేశారు. ఆమెను తిరుపతయ్య హైదరాబాద్ కు తీసుకొని వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత భార్యకు హైదరాబాద్ చూపిద్దామని అనుకున్నాడు.

కొద్దిసేపు హైదరబాద్ లో తిరిగాక సినిమాకు తీసుకొని వెళ్ళాడు. సినిమా పూర్తయిన తరువాత తనకు పిజ్జా కావాలని భార్య కోరింది. అయితే భార్యను షాప్ బయట ఉంచిన తిరుపతయ్య పిజ్జా తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్ళాడు. అయితే అతను బయటకు వచ్చేసరికి ఆమె కనిపించలేదు. అతను బయటకు వస్తున్న సమయంలో శివమల్లేశ్వరి ఆటోలో ఎక్కి వెళ్ళిపోయింది. దీంతో తిరుపతయ్య కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. శివమల్లేశ్వరి ఎందుకు అలా వెళ్ళిపోయింది.. ఆటోలో ఆమెతో ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION