అతిథి దేవో భ‌వ అంటే ఇదేనా బాబుగారూ!

అతిథి దేవో భ‌వ అంటే ఇదేనా బాబుగారూ!

అతిథిదేవో భ‌వ.. అంటే అతిథుల్ని దేవ‌త‌లుగా ఆద‌రించ‌డం. ఇది మ‌న సంస్కృతి. ఎక్క‌డో జ‌పాన్ దేశం నుంచి వ‌చ్చిన ఈ మహానుభావుడిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అవ‌మానించింది. అవ‌మానించ‌డ‌మంటే ప్ర‌వేశం నిరాక‌రించ‌డంలాంటిది కాదు. బుధ‌వారం తిరుప‌తిలో ప్రారంభ‌మైన చిల్డ్ర‌న్ సైన్స్ కాంగ్రెస్ స‌మావేశానికి నోబుల్ బ‌హుమ‌తి విజేత అయిన ట‌కాకి క‌జిత ముఖ్య అతిథి. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆయ‌న‌తో చ‌క్క‌గా మాట్లాడారు.

నోబుల్ ప్రైజ్ తెచ్చుకునే చిట్కాలు కొంచెం మా పిల్ల‌ల‌కి చెప్పండంటూ అడిగి మ‌రీ చెప్పించారు.ఆ త‌ర‌వాతేం జ‌రిగిందీ తెలిస్తే నోళ్ళునొక్కుకుంటారు. ఆయ‌న‌కు చెప్ప‌కుండా.. మిగిలిన ప్ర‌తినిధుల‌తో క‌లిసి, బయ‌ట‌కు వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రిగారు ఎందుకెళ్ళిపోయారో.. తానొక‌డే స్టేజిపై ఎందుకు మిగిలిపోయాడో తెలీక క‌జిత దిక్కులు చూశారు. ఆయ‌న ప‌రిస్థితిని గ‌మనించిన ఓ కార్య‌క‌ర్త వ‌చ్చి క‌జిత‌కు చంద్ర‌బాబు వేరే కార్య‌క్ర‌మం ఉండి వెళ్ళిపోయార‌ని తెలిపారు. కొద్దిసేప‌టికి క‌జిత కూడా అక్క‌డి నుంచి నిష్క్ర‌మించారు. నోబుల్ ప్రైజ్ విన్న‌ర్ వెంట క‌నీసం ఒక్క ఐఎఎస్ స్థాయి అధికారినైనా ఉంచ‌క‌పోవ‌డాన్నేమంటారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *