పరాయి మగాడితో మాట్లాడిందని..!

షరియా చట్టాలు ఉన్న దేశాల్లో శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ శిక్షలు అంత కఠినంగా ఉంటాయి కాబట్టే ఆ దేశాల్లో నేరాలు తక్కువ అని భావించేవారు కొందరుంటే.. ఇంత ఘోరమైన శిక్షలు అవసరమా అని వాదించే వాళ్ళు కూడా మరికొందరు ఉంటారు. ఇస్లామిక్ దేశాల్లో ఘోరమైన నేరాలకు పాల్పడితే బహిరంగంగా చంపడాలు కూడా ఉంటాయి.

ఇండోనేషియా దేశంలో 90 శాతం ప్రజలు ముస్లింలే..! ఇక్కడ చాలా ప్రాంతాల్లో షరియా చట్టం అమలులో ఉంటుంది. జూదం ఆడినా, మద్యం తాగినా, గే సెక్స్ లో పాల్గొన్నా, పెళ్ళి అయిన తర్వాత భార్యా భర్తలు వేరే వారితో సంబంధాలు పెట్టుకున్నా షరియా చట్టాల కింద వారిని శిక్షిస్తారు. సెప్టెంబర్ 11 న పలు నేరాలు చేసిన వారిని కఠినంగా శిక్షించారు. అందరి ముందూ కొరడాలతో కొట్టారు. వాళ్ళలో ఓ మహిళ కూడా ఉంది. అందరి ముందూ ఆమెను కూడా కొరడాతో కొట్టి శిక్షించారు. ఆ మహిళ భర్తతో కాకుండా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో ఆమెను శిక్షించారు. పోలీసులే కాకుండా చాలా మంది ప్రజలు కూడా ఆ తంతును చూస్తూ ఉండిపోయారు.

మహిళలపై ఆంక్షలు ఎక్కువ:
ఆ దేశంలో మహిళలపై ఆంక్షలు ఎక్కువే.. ఆడవారు బుర్ఖా లేకుండా తిరగకూడదు. టైట్ గా బట్టలు వేసుకున్నా పోలీసులు అరెస్ట్ చేస్తారు. వేరే వ్యక్తితో మాట్లాడడం పోలీసులు చూస్తే అక్కడే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. షరియా చట్టాల ప్రకారం నిందితులకు 100 కొరడా దెబ్బల నుండి 100 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

About the author

Related

JOIN THE DISCUSSION