కారు బంప‌ర్‌లో చిక్కుకుని 34 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం..!

కారు ఢీ కొట్టిన వెంట‌నే ఎగిరి ప‌డ‌లేదా మూగ‌జీవి. ఎలా సాధ్య‌ప‌డిందో గానీ.. కారు బంప‌ర్‌లో చిక్కుకుంది. స‌గం శ‌రీరం బంప‌ర్‌లో, స‌గం శ‌రీరం గాల్లో. ఇలా 34 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించింది. తాను చేరాల్సిన చోటికి చేరిన త‌రువాత గానీ ఈ విష‌యాన్ని చూసుకోలేదా మ‌హిళ‌. తీరా దాన్ని చూశాక దాన్ని బ‌య‌టికి తీయ‌డం ఆమె వ‌ల్ల కాలేదు.

దీనితో స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వారొచ్చి ఆ జాకాల్‌ను బ‌య‌టికి తీశారు. జంతు సంర‌క్ష‌కుల‌కు అప్ప‌గించారు. కొన్ని వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం ఆ మూగ‌ప్రాణిని క‌న‌నాస్కిస్ అడ‌వుల్లో వ‌దిలేశారు. కెన‌డాలో చోటు చేసుకున్న ఘ‌టన ఇది. ఆ అమెరిక‌న్ జాకాల్‌ను స్థానికంగా `కొయోటె` అని పిలుస్తారు.

జార్జియా క్నాక్స్ అనే యువ‌తి ఆల్బ‌ర్టా నుంచి కారులో వ‌స్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్య‌లో ఆమెకు ఈ అమెరిక‌న్ జాకాల్ అడ్డుగా వ‌చ్చింది. కారును ఆప‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. సాధ్యం కాలేదు. కారు ఓ మోస్త‌రు వేగంతో జాకాల్‌ను ఢీ కొట్టింది.

ఆ స‌మ‌యంలో వ‌చ్చిన‌ శ‌బ్దాన్ని విని.. క్నాక్స్ ఆ ప్రాణి చ‌నిపోయి ఉంటుంద‌నుకుంది. కారును ఎక్క‌డా ఆప‌కుండా ఆల్బ‌ర్టాకు పోనిచ్చింది. అక్క‌డ దిగి చూశాకే అస‌లు విష‌యం తెలిసింది. ఈ దృశ్యాన్ని ఆమె ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్వ‌ల్ప గాయాలు మాత్ర‌మే అయ్యాయ‌ని జంతు సంర‌క్ష‌కులు తెలిపారు.

About the author

Related

JOIN THE DISCUSSION