సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోండంటూ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి వేడుకుంది.. కానీ..!

ఆమె తొమ్మిది నెలల గర్భవతి.. పురిటినొప్పులకు తట్టుకోలేకపోయింది. సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయమని వేడుకుంది. కానీ చైనా చట్టాల ప్రకారం మహిళ తల్లిదండ్రుల అనుమతి ఉండాల్సిందే.. కానీ ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆమె హాస్పిటల్ అయిదో అంతస్థు మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోయారు. తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి వేడుకున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

41 వారాల గర్భవతి అయిన ఆ మహిళ కడుపులో పెరుగుతున్న పిల్లవాడి తల చాలా పెద్దగా ఉందని డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఆమెకు సిజేరియన్ ఆపరేషనే చేయాలి. చైనా చట్టాల ప్రకారం కుటుంబసభ్యుల అనుమతి లేకుండా సిజేరియన్ చేయరు. తల్లిదండ్రులు రాగానే ఆమె వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంది.. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆమె పరిస్థితిని చూస్తే కనీసం నిలబడడానికి కూడా ఆమె ఒంట్లో శక్తి లేదు. కొన్ని కొన్ని సార్లు బాధతో కిందకు కూడా వాలిపోయింది. ఈ ఘటన అంతా శాంగ్జి ప్రావిన్స్ లోని ఓ పేరుమోసిన ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

ఇక ఆ బాధ భరించలేని మహిళ అయిదో అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ఆత్మహత్యగా పోలీసులు, అక్కడి మీడియా వర్ణించింది. కానీ ఇది చైనా చట్టాల వలన జరిగిన హత్య అని పలువురు వ్యాఖ్యానించారు. ఇకనైనా చట్టాలు మార్చాలని కోరారు.

About the author

Related

JOIN THE DISCUSSION