ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని ఎగబడుతున్నారు.. ఎవరామె..?

అమ్మాయిల వెంట అబ్బాయిలు పడడం అనేది చాలా చాలా కామన్.. గుణవంతురాలి కంటే.. అందమైన అమ్మాయిల వెంట పడడానికే నేటి యువత ఎక్కువగా వెంపర్లాడుతూ ఉంటుంది. అయితే ఓ వికలాంగురాలిని పెళ్ళి చేసుకోవాలని అమెరికా లోని యువత పోటీ పడుతోంది.

లారెన్ అనే అమ్మాయి ‘టిండర్’ అనే సామాజిక మాధ్యమంలో తన ప్రొఫైల్ ను పెట్టింది. ఆమె అమెరికా లోని శాండియాగోకి చెందింది. ఆమెకు ఒక చేయి మాత్రమే ఉంది. గతంలో జరిగిన ఓ ప్రమాదంలో ఆమె తన చేతిని పోగొట్టుకుంది. బైక్ మీద వెళుతుండగా కిందపడి.. రోడ్డు పక్కనే ఉన్న సైన్ బోర్డును గుద్దుకుంది. ఆమె చనిపోతుందని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు. లారెన్ బ్రతికి బట్టకట్టింది. ఒక చేయి పోగొట్టుకున్నా ఆమెలో ఆత్మవిశ్వాసం కొంచెం కూడా తగ్గలేదు. ఒక చేతితోనే ఆమె అన్ని పనులూ చేసుకుంటూ ఉంది. అలాగే ఆమె యొక్క హాస్య చతురత అమోఘం అని అందరూ కొనియాడుతూ ఉంటారు.

అందుకే ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆమె తన ప్రొఫైల్ లో ఏమి చెప్పింది అంటే తాను ఒక ‘ఆర్మ్స్ డీలర్’ అని..! సాధారణంగా ఆర్మ్స్ డీలర్ అంటే తుపాకీలు సరఫరా చేసే వారు.. కానీ తన చేయి పోయిందన్న విషయం అందరికీ తెలియాలని.. అలాగే తనపై జాలి చూపించకూడదన్న ఉద్దేశంతో ఆమె అలా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమెతో డేటింగ్ కు వెళ్ళాలని.. పెళ్ళి చేసుకోవాలని ఎందఱో యువకులు పోటీ పడుతున్నారు.

ahhhh

A post shared by Lauren (@duckusername) on

About the author

Related

JOIN THE DISCUSSION