త‌న‌కు లొంగ‌లేద‌ని మ‌హిళ‌పై దారుణ హింస‌..హ‌త్య‌!

త‌న‌కు లొంగ‌లేద‌ని ఓ మ‌హిళ‌పై దారుణ హింస‌కు పాల్ప‌డ్డాడో కిరాత‌కుడు. ఆ మ‌హిళ‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసి మ‌రీ హ‌త‌మార్చాడు. ఈ ఘ‌ట‌న బిహార్‌లో చోటు చేసుకుంది. దీన్ని నిర్భ‌య త‌ర‌హా ఉదంతంలో పోల్చుతున్నారు పోలీసులు.

బిహార్ రాజ‌ధాని పాట్నా స‌మీపంలో ఉన్న నౌబత్‌పూర్‌ గ్రామంలో నివ‌సిస్తుండే వాడు ధీరజ్‌ పాశ్వాన్‌ అనే 22 ఏళ్ల యువకుడు. అదే గ్రామానికి చెందిన ఓ మ‌హిళ‌తో అత‌నికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ మ‌హిళ ధీర‌జ్ పాశ్వాన్‌తో చ‌నువుగా మ‌స‌లుకునేది.

దీన్ని త‌ప్పుగా అర్థం చేసుకున్నాడు ధీర‌జ్‌. ఆమెను లొంగ‌దీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దురుద్దేశం తెలిసిన ఆ మ‌హిళ అత‌ణ్ణి దూరంగా ఉంచ‌సాగింది. ఈ క్ర‌మంలో- గురువారం సాయంత్రం ధీర‌జ్ పాశ్వాన్ త‌న స్నేహితుడి సాయంతో ఆమెపై అత్యాచారం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు.

ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీనితో ఆగ్ర‌హించిన ధీర‌జ్‌.. ఆమెపై దాడికి దిగాడు. క‌ర్ర‌తో త‌ల ప‌గుల‌గొట్టాడు. స్పృహ త‌ప్పి ప‌డి ఉన్న ఆమె జననేంద్రియాల్లోకి ఇనుపరాడ్లను చొప్పించి హింసించాడు.

అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయాడు. ర‌క్త‌మోడుతూ క‌నిపించిన బాధితురాలిని గ‌మ‌నించిన స్థానికులు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు సమాచారం అందించారు. వెంట‌నే వారు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఆమెను పాట్నా మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించారు.

అక్క‌డ చికిత్స పొందుతూ ఆ మ‌హిళ మృతి చెందింది. ఈ ఘటనపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయ‌డానికి పోలీసు యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకుంది. దీనికోసం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు బిహార్ అద‌న‌పు డీజీ ఎస్‌ కే సింఘాల్‌ తెలిపారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు ధీరజ్‌ను అదుపులోకి తీసుకున్నామని.. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామ‌ని అన్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION