ఈమె ఓ నిత్య పెళ్ళి కూతురు.. కి’లేడీ’ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుందో తెలుసా..?

సాధారణంగా ఒకరిని మోసం చేస్తూ మరొకరిని పెళ్ళి చేసుకొనే మగవాళ్ళను నిత్య పెళ్ళికొడుకు అంటుంటాం.. అయితే ఇక్కడ చూస్తున్న మహిళ మాత్రం ఓ నిత్య పెళ్ళి కూతురు..! ఒకటి రెండు కాదు.. ఏకంగా అయిదు పెళ్ళిళ్ళు చేసుకుంది. చేసుకున్న వారిని వేధిస్తూ.. వారి మీద తప్పుడు కేసులు బనాయించి డబ్బులు గుంజడం ఈమె వృత్తి.. అలా నలుగురిని మోసం చేసింది.. చివరికి అయిదో వ్యక్తిని కూడా మోసం చేయాలని పరయత్నించింది.. కానీ ఆమె ముందు పెళ్ళి చేసుకున్న వ్యక్తి అయిదో భర్తకు బాసటగా నిలవడంతో ఆమె బండారం మొత్తం బయటపడింది..!

సంధ్య అనే మహిళ ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తూ ఉండేది. ఆమె ప్రపుల్ వర్మను మొదటిసారి పెళ్ళి చేసుకుంది. అయితే కొద్ది రోజులకు ప్రపుల్ చనిపోవడంతో విజయ్ రఘువంశీ అనే వ్యక్తిని రెండో పెళ్ళి చేసుకుంది. అతను ప్రాపర్టీ బిజినెస్ చేయడంతో పాటు.. 50 ఎకరాల ఆస్థి కూడా ఉంది. వీరి పెళ్ళి అయిన ఆరు నెలలకు ఆమె అతనితో గొడవపడడం మొదలుపెట్టాడు. విజయ్ ఆమెను వదిలించుకోవడానికి రెండు ఎకరాల ఆస్థి.. కొంచెం డబ్బులు కూడా ముట్టజెప్పాడు.

విజయ్ కు విడాకులు కూడా ఇవ్వకుండానే సంధ్య ఆశిష్ సూర్యవంశీ అనే వ్యక్తిని చింద్ వాడా లోని ఆర్య సమాజ్ లో పెళ్ళి చేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత అతను వేధిస్తున్నాడని కేసు పెట్టింది. దీంతో అతనికి కోర్టు నోటీసులు కూడా పంపింది. ఆ తర్వాత ఆశిష్ తో కొంచెం డబ్బులు ఇచ్చి ఆమెను వదిలించుకున్నాడు. ఆశిష్ తో కోర్టులో కేసులు నడుస్తూ ఉండగానే ఆమె దినేష్ తరామ్ అనే వ్యక్తిని నాలుగో పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాత అతనిపై కూడా వేధింపుల కేసు పెట్టింది.. అతను తమ ఇద్దరికీ పెళ్ళి అయిందని కోర్టులో సాక్ష్యాలు చూపించి ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు.

ఆ తర్వాత భోపాల్ కు చెందిన రమేష్ అనే వ్యక్తి జీవితంలో సంధ్య ప్రవేశించింది. ఆయన భార్య చనిపోవడంతో అతని పిల్లవాన్ని చూసుకోడానికి మళ్ళీ పెళ్ళి చేసుకోమని బంధువులు చెప్పారు. దీంతో మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా సంధ్యను సంప్రదించి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. అయితే కొద్దిరోజులకు రమేష్ పై కూడా పలు అభియోగాలను మోపింది. వరకట్న వేధింపులు తనపై మొదలయ్యాయని కోర్టును ఆశ్రయించింది. అతన్ని కొద్ది రోజులు జైలులో కూడా పెట్టారు. అయితే తాను నిర్దోషినని రుజువు చేసుకోడానికి బెయిల్ మీద బయటకు వచ్చిన రమేష్.. సంధ్య చరిత్రను తిరగదోడాడు. అప్పుడు అతనికి తెలిసొచ్చింది తన నంబర్ అయిదు అని.. ఆమెను ముందు పెళ్ళి చేసుకున్న వాళ్ళు తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించి రమేష్ ను నిర్దోషిగా నిరూపించారు. ఇప్పుడు సంధ్యపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

About the author

Related

JOIN THE DISCUSSION