క‌ళ్లు తిరిగేంత ఎత్తులో కారులో వెళ్తోంటే..

క‌ళ్లు తిరిగేంత ఎత్తులో కారులో వెళ్తోంటే..

చైనాలో అంతేమ‌రి. ఏది క‌ట్టినా అతి పెద్ద‌గానే ఉంటుంది. త్రీ గోర్జెస్ డ్యామ్ క‌ట్టినా అంతే. అతి పెద్ద టెలిస్కోప్ నిర్మించినా అంతే. ఎత్తైన ప్ర‌దేశాల్లో రైల్వే లైన్లు వేసినా అంతే. తాజాగా- ప్రపంచంలో ఎత్తయిన వంతెన‌ను క‌ట్టి మాకు మేమే సాటి అని మ‌రోసారి అనిపించుకున్నారు చైనీయులు.

యునాన్‌-గిజో రాష్ట్రాల‌ను అనుసంధానిస్తూ ఓ న‌దిపై దీన్ని నిర్మించారు. ఈ వంతెన కోసం 144 మిలియ‌న్ డాల‌ర్ల‌ను చైనా ఖ‌ర్చు చేసింది. 2013లో దీని నిర్మాణాన్ని మొద‌లు పెట్టారు. 2016 డిసెంబ‌ర్ 30న దీనిపై వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఈ వంతెన‌కు ఆధారం కేబుళ్లు మాత్ర‌మే. 1341 మీట‌ర్ల పొడ‌వున్న కేబుళ్ల‌ను దీనికోసం వాడారు. వంతెన కింద ఆధారం ఏదీ ఉండ‌దు. గాల్లో తేలుతున్న అనుభూతిని క‌లిగిస్తుందీ వంతెన‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *