పోలీసుల తెలివికి జోహార్‌! ప‌ట్టాల ప‌క్క‌న ప‌డేసినంత మాత్రాన..!

ప‌ట్టాల ప‌క్క‌న మృత‌దేహాన్ని ప‌డేసినంత మాత్ర‌న అది ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించవ‌చ్చ‌ని అనుకుంటే పొర‌పాటే! ప‌ట్టాల ప‌క్క‌న ఓ మృత‌దేహం ల‌భించ‌గా.. దాదాపుగా అంద‌రూ దాన్ని ప్ర‌మాదంగానే భావించారు.

 

పొర‌పాటున రైలు నుంచి జారి ప‌డి ఉంటాడ‌ని కొంద‌రు, ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చ‌ని మ‌రికొంద‌రు భావించారు. పోలీసులు మాత్రం- దీన్ని హ‌త్య‌గా తేల్చారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాల‌ను సేక‌రించే ప‌నిలో ఉన్నారు.

సాక్ష్యాధారాల సేక‌ర‌ణ దాదాపుగా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే హంత‌కుడిని ప‌ట్టుకుంటామ‌నీ తేల్చేశారు పోలీసులు. పోలీసుల తెలివి అంటే అదే మ‌రి. జార్ఖండ్‌లోని రాంచి స‌మీపంలోని క‌త‌రి బాగాన్ రైల్వే క్రాసింగ్ వ‌ద్ద ఓ వ్య‌క్తి మృత‌దేహాన్ని చూశారు స్థానికులు.

ఈ స‌మాచారాన్ని వారు వెంట‌నే చుఠియ్యా పోలీస్‌స్టేష‌న్‌కు చేర‌వేశారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ముఖం గుర్త‌ప‌ట్ట‌డానికి వీల్లేనంత‌గా త‌యారైంది.

ఒంటిపై ఉన్న దుస్తులు, ఇత‌ర‌త్రా ఆధారాలను సేక‌రించిన త‌రువాత అత‌ను కాంటాటోలి స‌మీపంలోని నేతాజీ న‌గ‌ర్‌కు చెంఇన గోవింద్ ముఖ‌ర్జీగా గుర్తించారు. సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి అత‌ని మొబైల్ ఫోన్‌, బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

స్థానికులంద‌రూ దీన్ని ప్ర‌మాదంగానో, ఆత్మ‌హ‌త్య‌గానో భావించారు. ఇదే విష‌యాన్ని పోలీసుల‌కూ చెప్పారు. పోలీసులు మాత్రం డిఫ‌రెంట్‌గా ఆలోచించారు. దీన్ని హ‌త్య‌గా తేల్చేశారు.

పోస్ట్‌మార్ట‌మ్ రిపోర్ట్ కూడా పోలీసుల అనుమానాన్ని బ‌ల‌ప‌రిచింది. ఎక్క‌డో చంపి.. గోవింద్ ముఖ‌ర్జీ మృత‌దేహాన్ని బాగాన్ రైల్వే క్రాసింగ్ వ‌ద్ద ప‌డవేసిన‌ట్టు నిర్ధారించారు. హంత‌కుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

About the author

Related

JOIN THE DISCUSSION