కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ క్రికెటర్.. ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటున్నాడు..!

యజువేంద్ర చాహల్.. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున అద్భుతంగా బౌలింగ్ చేసి.. భారతజట్టులో కూడా చోటు సంపాదించగలిగాడు. భారత్ శ్రీలంక మీద గెలిచిన టీ20 మ్యాచ్ లో కూడా మూడు వికెట్లు తీశాడు చాహల్. భారతజట్టులో ఉంటూ కొన్ని కోట్లు సంపాదిస్తున్న యజువేంద్ర చాహల్ ఇప్పటికి కూడా తన పాత ఇంట్లోనే ఉంటున్నాడు.

యజువేంద్ర చాహల్ మూలాలు హర్యానా రాష్ట్రం లోని జీంద్ జిల్లా దరియావాల్ గ్రామంలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం నుండి అతని తండ్రి ఆ గ్రామంలోని పటియాలా చౌక్ లోనే ఉంటున్నాడు. స్టార్ క్రికెటర్ అయిన తర్వాత కూడా చాహల్ తన కుటుంబంతో కలసి అటువంటి ఇంట్లోనే ఉండడం విశేషం. కొందరు కొన్ని లక్షలు సంపాదిస్తేనే పాత ఇళ్ళు కూలదోసి.. కొత్త ఇంట్లోకి వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటారు. అలాంటిది చాహల్ మాత్రం చిన్న ఇంట్లోనే ఉండాలి అని అనుకోవడం విశేషం. యజువేంద్ర చాహల్ తండ్రి కేకే చాహల్ జీంద్ కోర్టులో అడ్వొకేట్ గా పని చేస్తున్నాడు. అతని తల్లి గృహిణి. ఆ కుటుంబంలో చాహల్ అందరికంటే చాలా చిన్నవాడు. అతని కంటే పెద్దవాళ్ళు.. ఇద్దరు అక్కలు ఉన్నారు.. వారు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. చాహల్ కు చిన్నప్పటి నుండి చదువు అంటే పట్టేది కాదట.. ఇక క్రికెట్ పై ఆసక్తిని గమనించిన తండ్రి తనకున్న ఒకటిన్నర ఎకరం పొలంలో క్రికెట్ పిచ్ ను రెడీ చేసి ఇచ్చాడు. అక్కడే చాహల్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి ఇప్పుడు భారత్ కు ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరుకున్నాడు.

About the author

Related

JOIN THE DISCUSSION